Telangana minister ktr on next chief minister rumors
mictv telugu

కాబోయే సీఎం మీరేనా? కేటీఆర్ జవాబు ఇదీ!

August 5, 2022

తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారని, కాబోయే సీఎం కేటీఆరేనని ఎప్పట్నుంటో ఊహాగానాలు వస్తున్నాయి. ఢిల్లీలో భూకంపం పుట్టిస్తానని, జాతీయ పార్టీ పెడతానని కేసీఆర్ కూడా పలుమార్లు చెబుతుండడంతో అవి మరింత ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో ట్విటర్లో చురుగ్గా ఉండే మంత్రి కేటీఆర్‌ను ఓ నెటిజెన్ దీనిపై ప్రశ్నించారు. ‘కాబోయే ముఖ్యమంత్రి మీరేనా?’ అని ప్రశ్నించారు. అందుకు కేటీఆర్ జవాబిస్తూ.. ‘‘మనకు సమర్థుడైన కేసీఆర్ సీఎంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదాలతో ఆయన హ్యాట్రిక్ కొడతారు’’ అని అన్నారు. తద్వారా తర్వాతి ముఖ్యమంత్రి తన తండ్రేనని చెప్పినట్లయింది. కాలి గాయంతో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న కేటీఆర్ ‘ఆస్క్ కేటీఆర్’ పేరుతో ట్విటర్లో నిర్వహించిన కార్యక్రమంలో పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు కేసీఆర్ స్వాగతం పలక్కపోవడాన్ని సమర్థించుకున్నారు. ప్రైవేటు పర్యటనలకు సీఎం అలా వెళ్లక్కర్లేదన్నారు. బీజేపీది ప్రచార ఆర్భాటమేనని, డీపీలు మారిస్తే దేశం అభివృద్ధి చెందనని అన్నారు.