Telangana minister ktr satirical tweet on bbc offices it inquiries
mictv telugu

హిండెన్‌బర్గ్‌ ఆఫీసులోనూ ఈడీ దాడి చేస్తుందేమో.. కేటీఆర్

February 14, 2023

Telangana minister ktr satirical tweet on bbc offices it inquiries

ఢిల్లీ, ముంబైల్లోని బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. మోదీ సర్కారు ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ దాడులు చేయించిందని కాంగ్రెస్, ఇతర విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే అవి దాడులు కావని, పన్ను ఎగవేత ఆరోపణలపై వివరాలు మాత్రమే సేకరించామని ఐటీ ఆధికారులు చెప్పారు. కానీ విమర్శలు మాత్రం ఆగడం లేదు. గోధ్రా అల్లర్లలో మోదీ పాత్రపై బీబీసీ డాక్యుమెంటరీ తీసి ప్రసారం చేసినందుకే ఈ దాడులు జరిగాయని, ఇది మీడియా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టు అని విపక్షాలు అంటున్నాయి.

తెలంగాణ మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కూడా దీనిపై స్పందించారు. ఆదానీ గ్రూప్ అక్రమాలపై నివేదిక ఇచ్చినందుకు అమెరికాలోని హిండెన్‌బర్గ్ రీసెర్చి సంస్థలోనూ ఈడీ దాడులు చేస్తుందేమోనని ఎద్దేవా చేశారు. ‘‘బీబీసీ మోదీపై డాక్యుమెంటరీని ప్రసారం చేసిన కొన్నివారాలకే ఐటీ దాడులు చేసింది. ఐటీ, సీబీఐ, ఈడీలు బీజేపీ తోలుబొమ్మమల్లా మారి నవ్వులపాలవుతున్నాయి. తర్వాత ఏమిటి? హిండెన్‌బర్గ్’‌పై దాడి చేస్తుందా? లేక టేకోవర్ ప్రయత్నమా?’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.