కరోనాపై పోరుకి చిన్నారి సాయం..కేటీఆర్‌ ఫిదా - MicTv.in - Telugu News
mictv telugu

కరోనాపై పోరుకి చిన్నారి సాయం..కేటీఆర్‌ ఫిదా

April 5, 2020

Telangana minister ktr thanked kid for coronavirus donation

కరోనా మహమ్మారిపై పోరుకి ఎందరో దాతలు ముందుకు వచ్చి సహాయం చేస్తున్న సంగతి తెల్సిందే. తాజాగా అద్విత అనే ఓ చిన్నారి గళ్లలో దాచుకున్న డబ్బులను ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను గాంధీ మిరియాల అనే వ్యక్తి ట్విట్టర్ లో పోస్ట్ చేసి మంత్రి కేటీఆర్ ను ట్యాగ్ చేశారు.

‘కేటీఆర్‌ అన్నయ్య.. టీవీ, సోషల్ మీడియాల్లో అందరూ విరాళాలు ఇస్తుండడం చూసి నా కూతురు అద్విత కూడా తన సేవింగ్ గళ్ల గురిగి పగలకొట్టి మరీ డొనేట్ చేసింది… మీరంటే ఒక అభిమానం’ అంటూ గాంధీ మిరియాల ట్వీట్ చేశారు. ఆ పాప తెలంగాణ ప్రభుత్వానికి రూ.440 విరాళం ఇచ్చిన విషయానికి సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ ను కేటీఆర్‌ రీట్వీట్ చేస్తూ అద్వితకు థ్యాంక్స్‌ తెలిపారు.