ఉమ్మడి రాష్ట్ర కమిషన్‌లోనూ అక్రమాలు జరిగాయి…
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ)లో ప్రశ్నపత్రాల లీకేజీపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇది ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పని, అయితే మొత్తం వ్యవస్థకు చెడ్డ పేరు వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. టీఎస్‌పీఎస్సీ దేశంలోనే అత్యుత్తమ కమిషన్ అని, ఎన్నో పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించిందని ప్రశంసించారు. లీకేజీలపై శనివారం ఉదయం సీఎం కేసీఆర్, కమిసన్ చైర్మెన్ జనార్ధన్ రెడ్డి, మంత్రి హరీశ్ రావు, సీఎస్ శాంతికుమారి తదితరులతో8 జరిగిన రివ్యూ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. తర్వాత విలేకర్లతో మాట్లాడారు.
‘‘ఉమ్మడి రాష్ట్రంలోనూ కమిషన్‌లోనూ అక్రమాలు జరిగాయి. కమిషన్ రాజ్యాంగ సంస్థ. ప్రభుత్వ ప్రభావం ఉండదు. కానీ మేం తప్పు సరివించుకుని అభ్యర్థులకు న్యాయం చేస్తాం. ఇది కేవలం ఇద్దరు వ్యక్తం చేసిన తప్పు. తెలంగాణ కమిషన్ ఇప్పటివరకు 155 నోటిఫికేషన్లు జారీ చేసింది. 37 వేల ఉద్యోగాలను భన్తీ చేసింది. 99 శాతం పరీక్షలను పారదర్శకంగా నిర్వహించింది. ఒకేసారి ఏడు భాషల్లో పరీక్ష నిర్వహించిన ఘనత మా కమిషన్‌ది. అభ్యర్థులు నష్టపోకుండా అన్ని చర్యలూ తీసుకుంటాం’’ అని మంత్రి చెప్పారు. దీనిపై రాజకీయ నిరుద్యోగుల మాత్రమే ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, పుకార్లు నమ్మొద్దని కోరారు. విపక్షాలు పిల్లల జీవితాలతో ఆడుకోకూడదని అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వ్యాపం వంటి అనేక కుంభకోణాలు జరిగాయ, లీకేజీల్లో బీజేపీ వ్యక్తే కీలక నిందితుడని కేటీఆర్ మండిపడ్డారు. లీకేజీల వ్యవహారంపై నిపుణులతో చర్చించామని కేసీఆర్ సానుకూల నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఇలాంటి పొరపాట్లను పునరావృతం కానివ్వబోమని హామీ ఇచ్చారు. లీకేజీలపై సమగ్ర విచారణ జరిగిపి, బాధ్యులపై చర్యలు కచ్చితంగా తీసుకుంటామన్నారు.
ఫీజు రద్దు
రద్దయిన పరీక్షలు మళ్లీ రాసే అభ్యర్థులకు ఫీజు రద్దు చేస్తున్నామని, వారిన పరీక్షలకు అర్హులుగానే పరిగణిస్తామన ఆయన చెప్పారు. ‘‘2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. స్టడీ సర్కిళ్లలో ఉచిత భోజనం ఏర్పాటు చేస్తాం. అభ్యర్థులకు కోచింగ్ మెటీరియల్‌ను ఉచితంగా అందిస్తాం. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదంతోనే తెలంగాణ ఏర్పాడిది. నియామకాలను పారదర్శకంగా జరుపుతాం’’ అని ఆయన చెప్పారు.