తెలంగా సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు గండం నుంచి తప్పించుకున్నారు. ఈ రోజు ఆయన లిఫ్టులో అరగంటకుపైగా ఇరుక్కుపోయారు. ఆయనతోపాటు అనుచరులు, సిబ్బంది టెన్షన్‌కు గురయ్యారు. కొప్పుల ఈశ్వర్ సైఫాబాద్‌లోని సామ్రాట్ అపార్ట్‌మెంట్స్‌లో జరిగిన బుడగ జంగాల కార్యక్రమానికి హాజరయ్యారు. తర్వాత కిందికి దిగడానికి లిఫ్టులో వస్తుండగా అది హఠాత్తుగా మధ్యలోనే ఆగిపోయింది. పైకీ, కిందికి కదిలించలే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.
వెంటనే సాయం కోసం సంబంధిత అధికారులకు కబురు పంపారు. వారు హుటాహుటిన అక్కడికి చేరుకుని లిఫ్టును తెరవడానికి ప్రయత్నించారు. అరగంటపాటు కష్టపడి ఎట్టకేలకు గ్రిల్స్‌ను తెరవడంతో మంత్రి ఊపిరి పీల్చుకున్నారు. లిఫ్ట్ దశాబ్దాల నాటిది కావడంలో, లోడ్‌కు మించి ఎక్కడంతో మొరాయించినట్లు అధికారులు చెప్పారు.