తెలంగాణలోమరో మంత్రికి కరోనా  - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలోమరో మంత్రికి కరోనా 

August 8, 2020

Telangana minister mallareddy tested covid positive

కరోనా వైరస్ అసమానతలు చూపకుండా వ్యాపిస్తోంది. పేదా దనికా, బాస్ అటెండర్ వంటి తేడాలేమీ చూడకుండా శరీరాల్లోకి చేరిపోతోంది. తాజాగా తెలంగాణలో మరో మంత్రి  కోవిడ్ వ్యాధి బారిన పడ్డాడు. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అనారోగ్యంతో పరీక్షలు చేయించుకోగా కోవిడ్ వచ్చినట్లు తేలింది. దీంతో ఆయన ఇంట్లోనే క్వారంటైన్ అయ్యారు. భయడాల్సిందేమీ లేని, త్వరగానే కోరుకుంటానని ఆయన అభిమానుకు చెప్పారు. హోం మంత్రి మహమూద్ అలీ, ఆయన కొడుకుకు, మనవడికి కూడా కరోనాకు రావడం, ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకోవడం తెలిసిందే. 

ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, యాదగిరి, జీవన్ రెడ్డి, సుధీర్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారెడ్డికి కరోనా వచ్చింది. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కరోనాతో చనిపోయారు. ఏపీలో పలువురు రాజకీయ నాయకులు కోవిడ్ బారిన పడ్డారు. ఎంపీ విజయసాయి రెడ్డి తను క్వారంటైన్ వెళ్తున్నానని చెప్పి, తర్వాత తను కోవిడ్ నుంచి కోలుకున్నానని చెప్పుకొచ్చారు.