తలసాని ఫ్లెక్సీలు.. 25 వేల జరిమానా - MicTv.in - Telugu News
mictv telugu

తలసాని ఫ్లెక్సీలు.. 25 వేల జరిమానా

March 8, 2019

బహిరంగ ప్రదేశాల్లో భారీ భారీ హోర్డింగులు, ఫ్లెక్సీలు పెట్టొద్దని టీఆర్ఎస్ నేతలు ఇస్తున్న పిలుపులను అభిమానులు పట్టించుకోవడం లేదు. తమ నాయకుల ఫ్లెక్సీలు బ్యానర్లు, హోర్డింగులు, కటౌట్లతో ఊర్లను హోరెత్తిస్తున్నారు. సంబంధిత అధికారుల నుంచి కనీసం అనుమతులు కూడా తీసుకోవడం లేదు. పార్టీలు, కార్యకర్తలు, అభిమానులు, అనుచరుల  వ్యవహారం ఎలా ఉన్నా జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం తమ పని తాము చేసుకుపోతున్నారు.

Telangana minister talasani srinivas yadav flexies in ntr marg Hyderabad removed and ghmc officials fine 25000 to his followers

ఈ రోజు తలసాని శ్రీనివాస్ యాదవ్ పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ  శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సచివాలయం వద్ద ఎన్టీఆర్ మార్గ్‌లో అనుచరులు ఆయన ఫ్లెక్సీలను పెద్దసంఖ్యలో ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ నుంచి అనుమతి తీసుకోకుండా, తమ నాయకుడే కదా, ఎవరు అడ్డొస్తారని కట్టిపడేశారు. దీన్ని గమనించిన అధికారులు వాటిని తొలగించి, మంత్రి అనుచరులకు రూ. 25 వేల జరిమానా విధించారు.