Telangana Minister Vemula Prashanth Reddy's tweet went viral
mictv telugu

పిచ్చి కుక్కల్ని వేటాడే క్రమంలో వాటి కాట్లు మన చేతిపై పడ్తయి. అంత మాత్రాన వేట ఆపుతామా?

March 11, 2023

 

Telangana Minister Vemula Prashanth Reddy's tweet went viral

ఢిల్లీ లిక్కర్ స్కాం దేశవ్యాప్తంగా హాట్ టాపిగ్గా మారింది. ఈ స్కాంలో మొదటి నుంచీ ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు ఉదయం 10 గంటల తరువాత ఈడీ ఎదుట హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. పిచ్చికుక్కల్ని వేటాడే క్రమంలో వాటి కాట్లు మన చేతిపై పడతాయి. అంత మాత్రానా వేట ఆపుతామా. కవితమ్మా ధైర్యంగా ఉండండి అంటూ ప్రశాంత్ రెడ్డి ట్వీట్ చేశారు. కేసిఆర్ కుటుంబ సభ్యులమైన మేమందరం,ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ప్రజలందరం మీ ధర్మపోరాటంలో మీతోపాటు ఉన్నాము.. ఉంటము కూడా. ధర్మం మీ వైపు ఉంది. అంతిమ విజయం మీదే. మనదే అంటూ ట్వీట్ చేశారు.