జనతా కర్ఫ్యూ.. మంత్రులు ఇళ్లలో ఏంచేస్తున్నారో చూడండి - MicTv.in - Telugu News
mictv telugu

జనతా కర్ఫ్యూ.. మంత్రులు ఇళ్లలో ఏంచేస్తున్నారో చూడండి

March 22, 2020

ఎల్లప్పుడూ బిజీగా ఉండే మంత్రులకు జనతా కర్ఫ్యూలో భాగంగా ఆటవిడుపు దొరికినట్టయ్యంది. తెలంగాణ మంత్రులంతా ఇళ్లకే పరిమితమై జనతా కర్ఫ్యూలో పాల్గొన్నారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఆదివారం అంతా తన మనవడితో గడిపారు. ఇక పర్యాటక, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ కూడా ఆదివారం తన కుటుంబ సభ్యులతో ఇంటిలోనే తోటపని చేశారు. ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా తన కుటుంబంతో ఇంట్లోనే ఉన్నారు.

ఈ సందర్భంగా ఆయన తన భార్య, కూతురుతో కలిసి ఓ సెల్ఫీ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. జనతా కర్ఫ్యూను విజయం చేసిన ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పోలీసులను పెట్టిన విజయవంతం కాని కర్ఫ్యూలు.. ఇప్పుడు పోలీసుల గస్తీ లేకున్నా ప్రజలు కర్ఫ్యూను విజయవంతం చేశారన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు ఇంటిలో ఉండాలని అదే మనం సమాజానికి చేసే సేవ అని ఆయన అన్నారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గాడ్ తన మనవాళ్ళు, మానవరాళ్లతో కలిసి గడుపుతున్నారు.