తెలంగాణలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా..  - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా.. 

August 3, 2020

Telangana mlas mahipal reddy chander tested covid positive

తెలంగాణలో కరోనా కేసులు సంఖ్య తగ్గినట్టు ప్రభుత్వం చెబుతున్నా పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. పరీక్షల సంఖ్య తగ్గించడం వల్ల కేసులు తగ్గాయంటున్నాయి విపక్షాలు. ఆ సంగతి పక్కనబెడితే కరోనా బారిన పడుతున్న ప్రజా ప్రతినిధుల సంఖ్య మాత్రం బాగానే పెరుగుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలను కరోనా వెంటాడుతోంది. తాజాగా మరో ఇద్దరు దాని బారిన పడ్డాడు. 

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.  మహిపాల్‌తో పాటు తల్లి, తమ్ముడు, పీఏ, గన్‌మెన్‌లకు వ్యాధి సోకింది. వారు అపోలో చికిత్స తీసుకుంటున్నారు. చందర్ గచ్చిబౌలిలోని ఓ పైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సింగరేణి వనమహత్సోవంలో పాల్గొన్న తర్వాత ఆయనకు కరోనా లక్షణాలు బయటపడ్డాయి. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో గత 24 గంటల్లో 983 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 67,660కి చేరింది.