మేం జై హనుమాన్ అంటాం.. బీజేపీపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ - MicTv.in - Telugu News
mictv telugu

మేం జై హనుమాన్ అంటాం.. బీజేపీపై ఎమ్మెల్సీ కవిత ఫైర్

May 21, 2022

రాజకీయాలను దేవుడి పేరుతో నడిపితే సహించబోమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీజేపీని హెచ్చరించారు. జగిత్యాలలో జరిగిన కార్యక్రమంలో ఆమె దేవుడు, రాజకీయాల గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘బీజేపీ జై శ్రీరామ్ అంటే మేం జై హనుమాన్ అంటాం. ప్రశ్నించాల్సిన అవసరమొస్తే జనం దేవుణ్ని కూడా ప్రశ్నిస్తారు. అసలు దేవుడి కంటే భక్తుడే గొప్ప. నాయకుడి కంటే ప్రజలే గొప్ప.. మీరు రాజకీయ దేవుడి చుట్టే తిప్పితే చూస్తూ ఊరుకునే ప్రస్తక్తే లేదు. మేం దేవుడి పేరుతో రాజకీయాలు చేయండం దేవుణ్ణి ఎగ్జిబిషన్ లాగా బయట ప్రదర్శించడం. మీ బెదిరింపులకు బెదరం’ అని అన్నారు.

బీజేపీ ఎంపీ అరవింద్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆమె మండిపడ్డారు. మోదీ హయాంలో నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయని, ఆయన ఇస్తామన్న 15 లక్షల రూపాయలు ఎప్పుడిస్తారని ఆమె మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో జగిత్యాల జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ గెలుపు కోసం కష్టపడాని, ప్రభుత్వ విజయాలను గల్లీ గల్లీకి తిరిగి చెప్పాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.