Telangana mountaineer Malavath Purna creates history again, climbs Mt. Denali in US
mictv telugu

7 ఖండాల్లోని 7 పర్వతాలను అధిరోహించిన తెలంగాణ ముద్దు బిడ్డ

June 9, 2022

ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి రాష్ట్ర కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన తెలంగాణ బిడ్డ మలావత్ పూర్ణ మరో ఘనత సాధించింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన పూర్ణ ప్రపంచంలోని 7 ఖండాల్లో 7 పర్వత శిఖరాలను అధిరోహించి సరికొత్త రికార్డ్‌ను నెలకొల్పింది. 13 ఏళ్ల వయసులోనే అంటే 2014వ సంవత్సరంలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి సత్తా చాటి, ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచింది.

తాజాగా అమెరికా దేశం అలస్కా ప్రాంతంలోని సముద్ర మట్టానికి 6,190 మీటర్ల ఎత్తులో ఉన్న మౌంట్ డెనాలీ పర్వతాన్ని అధిరోహించింది. జూన్‌ 5న డెనాలీ శిఖరానికి చేరుకున్న పూర్ణ.. ఉత్తరాదికి చెందిన తండ్రి కూతుళ్లు పద్మశ్రీ అవార్డు గ్రహీత అజీత్‌ బజాజ్‌, దియా బజాజ్‌, విశాఖకు చెందిన అన్మీశ్‌ వర్మతో కలిసి మే 23న ఈ యాత్ర ప్రారంభించారు. ఏస్‌ ఇంజినీరింగ్‌ అకాడమీ ఆర్థిక సాయం, ట్రాన్సెండ్‌ అడ్వెంచర్స్‌ సంస్థ సహకారంతో యాత్ర పూర్తి చేశారు. తాజా రికార్డుపై పూర్ణ కోచ్‌ శేఖర్‌బాబు హర్షం వ్యక్తం చేశారు. తాజా రికార్డుపై ఆమె కోచ్‌ శేఖర్‌బాబు సంతోషం వ్యక్తి చేశారు.