పుర ఎన్నికల్లో కారు జోరు..83 స్థానాల్లో ఆధిక్యం - MicTv.in - Telugu News
mictv telugu

పుర ఎన్నికల్లో కారు జోరు..83 స్థానాల్లో ఆధిక్యం

January 25, 2020

Telangana.

మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అనూహ్య ఫలితాలు సాధిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 120 మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ హవా కొనసాగుతోంది. ఉదయం 10 గంటల వరకు వెల్లడైన ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ ఏకంగా 44 మున్సిపాలిటీల్లో ఘన విజయం సాధించింది. 

83 మున్సిపాలిటీల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది. రెండు కార్పొరేషన్లను సైతం టీఆర్‌ఎస్‌ తన ఖాతాలో వేసుకుంది. బొల్లారం, కొత్తపల్లి, బాన్సువాడ, ధర్మపురి, డోర్నకల్, పెద్దపల్లి, మరిపెడ, వర్దన్నపేట, భీమగల్, పరకాల, సత్తుపల్లి, సదాశివపేట, ఆర్మూర్, ఆందోళ్, పెబ్బైర్, గుండ్ల పోచంపల్లి, కొత్తకోట, తూముకుంట, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలను కారు కైవసం చేసుకుంది.