తెలంగాణ కొత్త సీఎస్‌గా శైలేంద్ర - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ కొత్త సీఎస్‌గా శైలేంద్ర

January 31, 2018

తెలంగాణ ప్రభుత్వ కొత్త కార్యదర్శిగా సీనియర్ ఏఐఎస్ అధికారి శైలేంద్రకుమార్ జోషీ నియమతులయ్యారు. ఈమేరకు సీఎం నిర్ణయంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ ఎస్పీ సింగ్ పదవీకాలం బుధవారంతో ముగియనున్న నేపథ్యంలో జోషిని నియమించారు.  ఆయన ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు బాధ్యతలు స్వీకరిస్తారు.  ప్రస్తుతం జోషి నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగావిధులు నిర్వహిస్తున్నారు. 1984 బ్యాచ్‌కు చెందిన ఆయన 1959లో యూపీలోని బరేలీలో జన్మించారు. రూర్కీ ఐఐటీలో చదువుకుని ఢిల్లీ ఐఐటీలో జోషి పీజీ చేశారు. ప్రాథమిక విద్యలో థర్డ్ లాంగ్వేజ్‌గా తెలుగు చదువుకున్నారు. కాగా, సకాలంలో కాళేశ్వరం పూర్తి చేయడం తన జీవితాశయమని జోషి పేర్కొన్నారు. సీఎస్‌గా తనను ఎంపిక చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు చెబుతున్నానని, ప్రజాసేవకు పునరంకితం అవుతున్నానని అన్నారు.