తెలంగాణ కొత్త సచివాలయం నమూనా ఇదే - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ కొత్త సచివాలయం నమూనా ఇదే

July 7, 2020

juhjgty

తెలంగాణ పాత సచివాలయ భవనం కూల్చేందుకు అనుమతి రావడంతో ఆ దిశగా పనులు ప్రారంభం అయ్యాయి. దాని స్థానంలో కొత్త భవనం నిర్మించేందుకు కసరత్తు కూడా చేశారు. త్వరలోనే నిర్మించబోయే ఈ భవనం ఎలా ఉంటుందో దానికి సంబంధించిన నమూనాను సీఎం కార్యాలయ అధికారులు విడుదల చేశారు. రాజభవనంను తలపించేలా దీన్ని తయారు చేశారు. పెద్ద బిల్డింగ్, దాని ముందు చిన్న కొలను ఉండేలా ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి, మంత్రుల పేషీలు ఏర్పాటు చేసి మొత్తం పాలన వ్యవహారాలు సరికొత్త సాంకేతికతతో సాగేలా ఏర్పాటు చేయనున్నారు. 

సెక్రటేరియట్ భవనం పాతది కావడంతో దాని స్థానంలో కొత్తది నిర్మించాలని సీఎం కేసీఆర్ చాలా రోజుల క్రితమే నిర్ణయించారు. పాత భవనం కూల్చివేతను వ్యతిరేకిస్తూ కొంత మంది కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ఇన్నాళ్లు వాయిదా పడిన కూల్చివేత తాజాగా హైకోర్టు నిర్ణయంతో కూల్చివేతలు ప్రారంభం అయ్యాయి. ఇది పూర్తి చేసిన వెంటనే టెండర్లు కూడా పిలిచి నిర్మాణ పనులు చేపట్టే అవకాశం ఉంది.