తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవానికి వచ్చే ప్రముఖుల వీరే..
తెలంగాణ సచివాలయం నిర్మాణం పూర్తైంది.రూ.617 కోట్లతో సచివాలయ భవనాన్ని గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ పద్ధతిలో నిర్మించారు. భవనంలోకి సహజమైన గాలి, వెలుతురు వచ్చేలా ప్లాన్ చేశారు. కొత్త సచివాలయానికి ఇప్పటికే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరుని ఖరారు చేశారు. సచివాలయం లోపలే టెంపుల్, మజీద్ కూడా నిర్మిస్తున్నారు.
దాదాపు సచివాలయం నిర్మాణం పూర్తి కావడంతో ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారు చేశారు. ఫ్రిబ్రవరి 17న ఉ.11:30 నుంచి 12:30 ని.ల మధ్య సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఆ రోజు మొదట వాస్తుపూజ, చండీయాగం, సుదర్శనయాగం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులకు ఆహ్వానం అందించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, జార్ఖండ్ సీఎం సొరేన్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వినీ యాదవ్‌తో పాటు బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రతినిధిగా జెడియు జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్, అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ కూడా ముఖ్య అతిథిలుగా హాజరుకానున్నారు. సచివాలయ ప్రారంభోత్సవం తర్వాత.. మధ్యాహ్నం, సికింద్రాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభలో సచివాలయ ప్రారంభోత్సవం లో పాల్గొన్న పైన పేర్కొన్న ముఖ్య అతిథులందరూ పాల్గొంటారు.
ఇవి కూడా చదవండి :
మోడీ ‘డాక్యుమెంటరీ’పై హెచ్‌సీయూలో రచ్చ.. ఏబీవీపీ సీరియస్
Today Gold Price : భగ్గుమంటున్న బంగారం.. రేపోమాపో 60 వేలకు దగ్గరలో