వైద్యఆరోగ్య శాఖలో 1,513 కొత్త పోస్టులు.. - MicTv.in - Telugu News
mictv telugu

వైద్యఆరోగ్య శాఖలో 1,513 కొత్త పోస్టులు..

November 29, 2017

తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖకు కొత్తగా 1,513 పోస్టులు మంజూరు చేసింది. దీనికి సంబంధించి మంగళవారం ఆర్థిక శాఖ మూడు ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య విధాన పరిషత్‌ కోటా కింద  640 పోస్టులు వచ్చాయి.

బీబీనగర్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన నిమ్స్‌కు 873 పోస్టులు దక్కాయి. వైద్య విధాన పరిషత్‌ నిర్వహిస్తున్న 13 ఆస్పత్రుల్లో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా 640 పోస్టులను భర్తీ చేస్తామని ఉత్తర్వుల్లో తెలిపారు.  

బీబీ నగర్ నిమ్స్‌ ఆస్పత్రిలో 873 పోస్టులను ఒక్కసారిగా కాకుండా రెండు విడతల్లో భర్తీ చేస్తామన్నారు. ఇందులో భాగంగా తొలి విడతలో 428, మలివిడతలో 445 పోస్టులను భర్తీ చేస్తారు. నిమ్స్‌కు స్వయం ప్రతిపత్తి హోదా ఉన్న నిమ్స్ తన పోస్టులను తానే భర్తీ చేసుకుంటుంది. మరోపక్క.. ఎంఎన్‌జే ఆస్పత్రిలో కొత్తగా 251 పోస్టులను కేటాయిస్తూ జులై13న ఇచ్చిన జీవో 119లో కొన్ని సవరణలు చేశారు.