Home > విద్య & ఉద్యోగాలు > తెలంగాణ: 10,500 టీచర్ పోస్టులకు..వచ్చేవారంలో నోటిఫికేషన్

తెలంగాణ: 10,500 టీచర్ పోస్టులకు..వచ్చేవారంలో నోటిఫికేషన్

తెలంగాణ రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ కోసం లక్షల మంది నిరుద్యోగులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే టెట్ పరీక్షలో అర్హత సాధించి, ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ విడుదల అవుతుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో విద్యాశాఖ అధికారులు టీచర్ పోస్టులకు సంబంధించి, తాజాగా ఓ సమాచారాన్ని తెలియజేశారు.

పాఠశాల విద్యాశాఖ పరిధిలోని టీచర్ పోస్టులను టీఎస్‌పీఎస్సీ టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్టీ) ద్వారానే భర్తీచేస్తామని, ఈ అంశంపై టీఎస్‌పీఎస్సీ అధికారులు పలుమార్లు పాఠశాల విద్యాశాఖ అధికారులతో సమావేశమై, 10,500 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ టీచర్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరుతూ, ఆర్థికశాఖ అనుమతి కోసం ప్రతిపాదనలు పంపించామని, ఆర్థికశాఖ ఆమోదం లభించగానే పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తుందని పేర్కొన్నారు.

మరోపక్క మంత్రి హరీష్ రావు సైతం గురువారం రోజున సంగారెడ్డిలో.. డీఎస్సీ నోటిఫికేషన్‌ను వచ్చేవారంలో ఇస్తామని నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్‌ చెప్పారు. అంతేకాదు, తెలంగాణలో ఖాళీగా ఉన్న 9 వేల గ్రూప్ 4 ఉద్యోగాలను కూడా త్వరలోనే భర్తీ చేస్తామని, మరో రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్‌లు విడుదల అవుతాయని ఆయన తెలియజేశారు.

అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 లక్షల 10 వేల ఉద్యోగాలు ఇచ్చామని, పేద ప్రజల కోసం కేసీఆర్‌ పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి అమలు చేస్తున్నారన్నారు. సొంత స్థలాల్లో ఇళ్లు కట్టుకోవడానికి ప్రభుత్వం రూ.3 లక్షలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా దసరా పండుగ రోజున ప్రారంభిస్తామని హరీశ్‌ రావు తెలిపారు.

Updated : 3 Sep 2022 2:23 AM GMT
Tags:    
Next Story
Share it
Top