Telangana..Now services from 4 to 6 pm
mictv telugu

తెలంగాణ..ఇకపై సాయంత్రం 4 నుంచి 6వరకు సేవలు

July 23, 2022

Telangana..Now services from 4 to 6 pm

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాలో, ఆయా మండల్లాలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లోని డాక్టర్లు ఉదయం, సాయంత్రం ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలంగాణ వైద్యాశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నిర్ణయానికి ప్రధాన కారణం..ప్రజలు దూర ప్రాంతాల నుంచి అనారోగ్య సమస్యలతో, ఎమర్జెన్సీతో పెషేంట్లు ఆసుపత్రికి వస్తే, డాక్టర్లు అందుబాటులో లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సందర్బాల్లో డాక్టర్ల కోసం ఎదురుచూసి కొంతమంది పెషేంట్లు ప్రాణాలు కొల్పోయిన సందర్భాలు ఉన్నాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు, పెషేంట్ల కుటుంబ సభ్యులు డాక్టర్లు ఉదయం, సాయంత్రం ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. అనంతరం వైద్యాశాఖ మంత్రి హరీష్ రావును కలిసి వినతిపత్రాలను అందజేశారు.

ఈ క్రమంలో స్పందించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు.. రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో ఇకపై డాక్టర్లు సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు స్పెషాల్టీ క్లినిక్లను నిర్వహించాలని వైద్యులతో చర్చించి, శుక్రవారం ఓ సర్క్యులర్ జారీ చేశారు. ప్రస్తుతం మధ్యాహ్నం రెండు గంటల వరకే ఓపీ సేవలు లభిస్తున్నాయి. ఆ తర్వాత వైద్యులు బోధనకు వెళుతున్నారు. సాయంత్రం క్లినిక్స్ అవసరం గురించి ఇటీవల జరిగిన సమావేశాల్లో హరీశ్ రావు పదేపదే ప్రస్తావించారు.

Telangana..Now services from 4 to 6 pm

”ప్రతిరోజు ఉదయం 7:30 నుంచే ఓపీ స్లిప్పులు పంపిణీ చేయాలి. ఉదయం 9 నుంచి వైద్యులు అందుబాటులో ఉండాలి. చివరి పేషెంట్‌కు వైద్యం అందించే వరకు ఓపీని కొనసాగాలి. రక్త పరీక్షలకు శాంపిల్స్ సేకరిస్తే, రిపోర్టు ఆ రోజే ఇవ్వాలి. ఓపీ సమయం కొనసాగుతున్నంత సేపు నమూనాల సేకరణ, రిపోర్టులు అందజేసే కౌంటర్లు పనిచేయాలి. వీటన్నింటినీ సత్వరం అమలు చేయాలి” అని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.