సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపడానికి ఆకాశమే హద్దుగా అనుకున్నాడో అభిమాని. అందుకే ఆకాశంలోకి వెళ్లి అక్కడి నుంచి ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. అమెరికాలోని సంతోష్ రాకొండ్ల కేసీఆర్ కి వీరాభిమాని. శుక్రవారం కేసీఆర్ జన్మదినం సందర్భంగా తన అభిమానాన్ని చాటాలనుకున్నాడు. అందుకే బీఆర్ఎస్ మీద, కేసీఆర్ మీద ఉన్న అభిమానాన్ని జెండా రూపంలో ఆకాశంలోకి తీసుకెళ్లాడు. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది.
ఈ వీడియోలో..
సంతోష్ ముందుగా తను జెండాను చూపించాడు. పింక్ కలర్ క్లాత్ మీద జై భారత్, జై కేసీఆర్ ని రాశారు. ఆ కింద భాగంలో హ్యాపీ బర్త్ డే కేసీఆర్, ఆ కింద కేసీఆర్ బొమ్మ, పెద్ద అక్షరాలతో బీఆర్ఎస్ అనే అక్షరాలు కనిపిస్తాయి. ఆ తర్వాత సంతోష్ ఆ జెండాను తీసుకుని జెట్ లోకి వెళ్లాడు. అక్కడి నుంచి దూకి ఆ జెండాను ఎగురవేశాడు. ఆ సమయంలో వెనుక నుంచి ‘కోటి గొంతుకలను ఏకం చేసిన జెండా..’ అంటూ పాట వస్తుంది. చివరగా ప్యార్ చూట్ సహాయంతో క్షేమంగా నేల మీదకు చేరుకున్నాడు. ఈ స్కై డైవింగ్ తో కేసీఆర్ మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్న సంతోష్ నిజమైన వీరాభిమాని అంటూ అందరూ మెచ్చుకుంటున్నారు.