Telangana objected to the largest renewable energy project in AP
mictv telugu

ఏపీలోని అతిపెద్ద రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరం

May 31, 2022

Telangana objected to the largest renewable energy project in AP

ఏపీలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లు పరిధిలోని పిన్నాపురం వద్ద గ్రీన్ కో సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి జగన్ ఇటీవల శంఖుస్థాపన చేసిన విషయం తెలిసిందే. పనులు ప్రారంభమైన ఈ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది.

ఆ వివరాలతో తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ బోర్డు చైర్మెన్‌కు లేఖ రాశారు. అందులో పలు విషయాలను లేవనెత్తారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం పంప్డ్ హైడ్రో స్టోరేజీ ప్రాజెక్టుల పనులు చేపడుతోందని పేర్కొన్నారు. అలాంటి వాటి వివరాలు తెప్పించాలని బోర్డును కోరారు. అంతేకాక, ఈ ప్రాజెక్టు కోసం కృష్ణా జలాలను వాడరాదని, నదీ బేసిన్ నుంచి జలాల తరలింపుకు ఒప్పుకోమని తేల్చి చెప్పారు. అలాగే జల విద్యుత్ వినియోగం, అపెక్స్ కౌన్సిల్, బోర్డు అనుమతుల్లేని ప్రాజెక్టులను ఆపాలని లేఖలో విజ్ఞ‌ప్తి చేశారు.