2021లో తెలంగాణలో సెలవు రోజులు ఇవే  - MicTv.in - Telugu News
mictv telugu

2021లో తెలంగాణలో సెలవు రోజులు ఇవే 

November 11, 2020

Telangana official holidays

తెలంగాణ ప్రభుత్వం వచ్చే ఏడాది 2021కి సంబంధించి సెలవు రోజుల జాబితాను ప్రకటించింది. మొత్తం 28 సాధారణ సెలవులతోపాటు 25 ఐచ్ఛిక సెలవు రోజులు ఉంటాయని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.  రంజాన్, బక్రీద్, మొహర్రం, మిలాడ్ నబీ వంటి పండగల తేదీల్లో అప్పటి పరిస్థితులను బట్టి మార్పులు ఉంటే ఆ సందర్భంలో స్పష్టత ఇస్తామన్నారు. వచ్చే ఏడాదిలో కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు రెండో శనివారాలు, ఆదివారాలు మూసి ఉంటాయని వెల్లడించారు. ప్ర్రభుత్వ ఉద్యోగులు 5 ఐచ్ఛిక సెలవులను ముందస్తు అనుమతితో వాడుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

న్యూ ఇయర్ జనవరి 1 శుక్రవారం
భోగి జనవరి 13 బుధవారం
సంక్రాంతి జనవరి 14 గురువారం
రిపబ్లిక్ డే జనవరి 26 మంగళవారం
మహా శివరాత్రి మార్చి 11 గురువారం
హోలీ మార్చి 29 సోమవారం
 గుడ్ ఫ్రైడే  ఏప్రిల్ 2 శుక్రవారం
బాబూ జగ్జీవన్ రామ్ జయంతి ఏప్రిల్ 5 సోమవారం
ఉగాది ఏప్రిల్ 13 మంగళవారం
బీఆర్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 బుధవారం
శ్రీరామనవమి ఏప్రిల్ 21 బుధవారం
రంజాన్ మే 14 శుక్రవారం
రంజాన్ మరుసటి రోజు మే 15 శనివారం
బక్రీద్ జూలై 21  బుధవారం
బోనాలు ఆగస్టు 2 సోమవారం
స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15 ఆదివారం
మొహర్రం ఆగస్టు 19 గురువారం
శ్రీ కృష్ణాష్టమి ఆగస్టు 31 మంగళవారం
వినాయక చవితి సెప్టెంబర్ 10 శుక్రవారం
గాంధీ జయంతి అక్టోబర్ 2 శనివారం
బతుకమ్మ ప్రారంభం అక్టోబర్ 6 బుధవారం
విజయదశమి అక్టోబర్ 15 శుక్రవారం
విజయదశమి మరుసటి రోజు అక్టోబర్ 16 శనివారం
మిలాద్ ఉన్ నబీ అక్టోబర్ 19 మంగళవారం
దీపావళి నవంబర్ 4 గురువారం
కార్తీక పౌర్ణమి /గురునానక్ జయంతి నవంబర్ 19 శుక్రవారం
క్రిస్మస్  డిసెంబర్ 25 శనివారం
బాక్సింగ్ డే డిసెంబర్ 26 ఆదివారం