కాంగ్రెస్ నుంచి ఆరో వికెట్.. టీఆర్ఎస్‌లోకి ఉపేందర్ - MicTv.in - Telugu News
mictv telugu

కాంగ్రెస్ నుంచి ఆరో వికెట్.. టీఆర్ఎస్‌లోకి ఉపేందర్

March 14, 2019

తెలంగాణ కాంగ్రెస్‌కు దెబ్బపై దెబ్బలు తగులుతున్నాయి. ఆత్రం సక్కు, రేగా కాంతారావు, హరిప్రియా నాయక్, చిరుమర్తి లింగయ్య, సబితా ఇంద్రారెడ్డి జాబితాలో మరో ఎమ్మెల్యే కూడా చేరిపోయారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజక వర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కందాటి ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోడానికి రంగం సిద్ధమైంది.

Telangana paler MLA and former minister Kandati upender reddy joining TRS party.

ఆయన ఈ రోజు గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో సమావేశమయ్యారు. భేటీ తర్వాత మీడియాతో మాట్లాడతూ.. తాను  త్వరలోనే టీఆర్ఎస్‌లో చేరుతానని ఆయన ప్రకటించారు. డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉపేందర్. మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై గెలిచిన విషయం తెలిసిందే. మంత్రి పదవి ఆశించే ఆయన గులాబీ తీర్థం పుచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు వరసగా వెళ్లిపోతుండడంతో కాంగ్రెస్ ఇక కోలుకోలేదని భావించే ఎమ్మెల్యేలు వరుసమెట్టి టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు  కనిపిస్తోంది. పదవులు కోసం కొందరు, ఇతర ప్రయోజనాల కోసం కొందరు వెళ్లిపోతున్నారని, వారు వెళ్లినా తమకెలాంటి నష్టమూ లేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తమ పార్టీకి ఇలాంటి ఎన్నో ఒడిదొడుకులను తట్టుకుని నిలిచిందని గుర్తు చేస్తున్నారు. మరికొందరు ఎమ్మెల్యేల కూడా కేసీఆర్ పార్టీలో చేరి కాంగ్రెస్‌కు బ్లీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవచ్చు.