తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి త్రుటిలో భారీ ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న వాహన శ్రేణిలో కొన్ని వాహనాలు బీభత్సంగా ఢీకొన్నాయి. అతి వేగతో వెళ్తున్న ఆరు కార్లు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. అదృష్టవశాత్తూ కార్లలోని ఎయిర్ బ్యాగు¡లు తెరుచుకోవడంతో రేవంత్ రెడ్డి సహా అందరూ సురక్షితంగా తప్పించుకున్నారు. రెండు కార్లలోని పాత్రికేయులు స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. శ్రీపాద ప్రాజెక్టును చూడ్డానికి వెళ్తుండగా సంఘటన చోటుచేసుకుంది.