మహిళలకు తెలంగాణ డీజీపీ కీలక సూచన - MicTv.in - Telugu News
mictv telugu

మహిళలకు తెలంగాణ డీజీపీ కీలక సూచన

November 29, 2019

గురువారం రోజున రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డిని గుర్తుతెలియని వ్యక్తులు సజీవ దహనం చేసిన సంగతి తెల్సిందే. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ హత్యాచార ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి మహిళలకు, ముఖ్యంగా చీకటి పడిన తరువాత ప్రయాణాలు చేసేవారికి కీలక సూచనలు చేశారు. రాత్రి సమయాల్లో వృద్ధులు, మహిళలు ప్రయాణిస్తున్న వాహనాల్లో సమస్య తలెత్తుతే, వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఏదైనా ప్రమాదంలో వున్న వారు వెంటనే 100కు లేదా 9490617111 నంబర్‌‌కు ఫోన్‌ చేయాలని కోరారు.

అలాగే షీ టీమ్స్‌ వాట్సాప్‌ నంబర్లను ఆయన ట్వీట్ చేశారు. సాయం కోరేందుకు మొహమాటపడవద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు. అలాగే రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ కూడా షీ టీమ్స్‌ ల్యాండ్‌ లైన్‌ నంబరు 040-2785 2355, వాట్సాప్‌ నంబరు 9490616555ను వినియోగించుకోవాలని సూచించారు. తమకు సమాచారం ఇస్తే, పోలీసు టీమ్ వెంటనే సాయం చేసేందుకు వస్తుందని తెలిపారు. సాయం కోసం టోల్‌ ఫ్రీ నంబర్లు 112, 1090, 1091 కూడా వినియోగించుకోవచ్చన్నారు.