వివాదాస్పద పోస్టులు పెడితే జైలుకే..టీఎస్ పోలీస్ - MicTv.in - Telugu News
mictv telugu

వివాదాస్పద పోస్టులు పెడితే జైలుకే..టీఎస్ పోలీస్

August 13, 2020

Telangana police advisory to netizens

సోషల్ మీడియాలో నెటిజన్లు పెట్టె పోస్టులు కొన్ని సార్లు వివాదాలకు దారి తీస్తున్న సంగతి తెల్సిందే. ఇటీవల కర్ణాటక రాజధాని బెంగళూరులో యువకుడు చేసిన సోషల్ మీడియా కామెంట్ వివాదానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు కీలక సూచనలు చేశారు. సోషల్‌ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెడితే కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

శాంతిభద్రతల విఘాతానికి కారణమయ్యే వివాదాస్పద, అసత్య పోస్టులు సమాజంలో ఆస్తి, ప్రాణ నష్టాలు కలిగిస్తున్నాయని ఆయన తెలిపారు. సోషల్‌ మీడియాలో ఇలాంటి పోస్టులపై తెలంగాణ పోలీసులు ఇరవై నాలుగు గంటలపాటు నిరంతర నిఘా కొనసాగిస్తున్నారని డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. అసభ్యకరంగా, అల్లర్లకు కారణమయ్యే పోస్టులు పెట్టినవారిపై కేసులు నమోదు చేయాలని అన్ని పోలీసుస్టేషన్ల స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌ లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ విషయంలో పౌరులంతా పోలీసులకు సహకరించాలని మహేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. నెటిజన్లు తమకు ఎక్కడైనా అసభ్యకరమైన పోస్టు కనిపిస్తే వెంటనే రాష్ట్ర సైబర్ పోలీసులకు షేర్ చేయాలని తెలిపారు.