కొత్త పోలీసుల్లో 300 మందికి నేరచరిత్ర.. కొందరైతే పిల్లలపై రేప్ కూడా - MicTv.in - Telugu News
mictv telugu

కొత్త పోలీసుల్లో 300 మందికి నేరచరిత్ర.. కొందరైతే పిల్లలపై రేప్ కూడా

January 14, 2020

Telangana

తెలంగాణ పోలీసులుగా ఉద్యోగంలో చేరడానికి సిద్ధమైన వారిలో పలువురిపై కేసులు ఉన్నట్లు తెలిసింది. వీరు దరఖాస్తులో, నియామక ప్రక్రియలో తమ నేరచరిత్రను దాచి పెట్టినట్లు తెలంగాణ పోలీస్ నియామక మండలి గుర్తించింది. కొందరిపై హత్య కేసులతోపాటు పోక్సో(పిల్లలపై లైంగిక నేరాలు) కేసులు కూడా ఉన్నట్లు తెలుసుకుంది. 

పోలీస్ నియామక మండలి 2018లో 17వేల మంది కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేష్ జారీ చేసింది. దారుఢ్య, రాతపరీక్షలు నిర్వహించి 13,373 మంది పురుషులు, 2652 మందిని ఎంపిక చేసింది. వీరికి 9 నెలల పాటు శిక్షణ త్వరలో మొదలు కానుంది. దీంతో నియామక మండలి వీరి గత చరిత్రను పరిశీలిస్తోంది. వివిధ మార్గాల్లో సమాచారం సేకరించి 300 మందికి నేర చరిత్ర ఉన్నట్టు గుర్తించింది. దీంతో వీరిని ఉద్యోగాల్లోకి తీసుకోవాలా వద్దా అని అంతర్మనథనంలో పడింది. ఉన్నతాధికారులు, న్యాయనిపుణులతో సంప్రదించి నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోనుంది.