Telangana police decided to send Nigerians to their country
mictv telugu

ఫ్లైట్ టిక్కెట్ బుక్ చేస్తాం.. వెళ్లిపోండ్రా బాబు : పోలీసులు

June 29, 2022

Telangana police decided to send Nigerians to their country

ఇటీవల హైదరాబాదులో డ్రగ్స్ దందా విపరీతంగా నడిచిన విషయం తెలిసిందే. డ్రగ్స్ వల్ల పలు సంచలన నేరాలు జరిగాయి. దీంతో విచారణకు దిగిన పోలీసులు.. ఈ దందాలో ఎక్కువగా నైజీరియన్లే ఉన్నారని నిర్ధారించారు. అలాంటి వారిపై కేసులు బుక్ చేయకుండా వారిని వారి దేశానికి పంపే ప్రయత్నంలో ఉన్నారు. నగరంలో సుమారు 2500 మంది నైజీరియన్లు ఉండగా, అందులో 750 మంది వీసా గడువు ముగిసినా ఇంకా దేశంలోనే ఉన్నట్టు గుర్తించారు. వారిని పంపించేయడం వల్ల నగరంలో డ్రగ్స్ దందా తగ్గుతుందని పోలీసులు భావిస్తున్నారు. అంతేకాక, వారికి విమాన టిక్కెట్లు బుక్ చేసి వారి దేశాలకు అప్పగించాలని నిర్ణయించారు.