telangana Police Recruitment Board Released SI, Constable Results
mictv telugu

ఎస్సై, కానిస్టేబుల్ ఫలితాలు వచ్చేశాయి

October 21, 2022

telangana Police Recruitment Board Released SI, Constable Results

తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షలు రాసిన వారికి గుడ్ న్యూస్. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు శుక్రవారం విడుదల చేసింది. ఎస్సై అభ్యర్ధులు 46.80 శాతం ఉత్తీర్ణత సాధించారు.

ఎక్సైజ్ కానిస్టేబుల్ అభ్యర్ధులు 46.65 శాతం ఉత్తీర్ణత, ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్ 49.87 శాతం అభ్యర్ధులు పాసయ్యారు. ఇక తక్కువ శాతం సివిల్ కానిస్టేబుల్ అభ్యర్ధులు నమోదు చేశారు. కేవలం 31.39 శాతం మాత్రమే విజయం సాధించారు. కాగా, ఆగస్ట్ 7న ఎస్సై, 28న కానిస్టేబుల్ పరీక్షలు జరిగాయి. వాస్తవానికి ఫలితాలను సెప్టెంబరులోనే విడుదల చేయాలనుకున్నా ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగ అభ్యర్ధులకు కటాఫ్ మార్కులు తగ్గించడంతో కొంత ఆలస్యమైంది.