జనతా కర్ఫ్యూ.. గర్భిణీ మహిళను ఆదుకున్న ఎస్సై - MicTv.in - Telugu News
mictv telugu

జనతా కర్ఫ్యూ.. గర్భిణీ మహిళను ఆదుకున్న ఎస్సై

March 22, 2020

bngjh

దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. ప్రజలందరూ ఇళ్లకే అంకితం అయ్యారు. అటు కర్ఫ్యూ జరుగుతున్న సమయంలో ఓ గర్భిణీ మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. ఎసై సకాలంలో స్పందించి మహిళను ఆదుకున్నారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. 

వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని గొల్లపల్లి మండలంలో బేస్థపల్లి గ్రామంకు చెందిన మ్యకల మల్లేశ్వరి అనే మహిళ పురిటి నొప్పులతో బాధ పడుతున్నాది. హాస్పిటల్ కి వెల్దామంటే జనతా కర్ఫ్యూలో భాగంగా వాహనాలు అందుబాటులో లేవు. దీంతో ఈ విషయాన్ని పిహెచ్‌సీ డాక్టర్‌కి సమాచారం ఇచ్చింది. సదరు పిహెచ్‌సీ డాక్టర్ సమయస్ఫూర్తిగా వ్యవహరించి వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు వెంటనే స్పందించిన గొల్లపల్లి ఎస్ఐ కిరణ్ పోలీస్ వాహనంలో మ్యకల మల్లేశ్వరిని అలాగే ఆమె భర్తను సురక్షితంగా జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.