లాక్ డౌన్ పై సర్వే..చదువులేనోళ్లే నయం - MicTv.in - Telugu News
mictv telugu

లాక్ డౌన్ పై సర్వే..చదువులేనోళ్లే నయం

April 1, 2020

telangana police survey on lock down

కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని ఆంక్షలు విధించింది. లాక్ డౌన్ ను విజయంవంతం చేయడానికి పోలీసులు అహర్నిశలు కష్టపడుతున్నారు. అయినా కూడా కొందరు ఆకతాయిలు రోడ్లపైకి వస్తున్నారు. అలాంటి వాళ్ళకు కొందరు పోలీసులు లాఠీ దెబ్బలను రుచి చూపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

మరికొందరు పోలీసులు ఎవ్వరూ బయటికి రాకూడదని దణ్ణం పెట్టి మరీ బతిమిలాడుతున్నారు. తాజాగా లాక్ డౌన్ పై తెలంగాణ పోలీసులు ఓ సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. చదువుకున్న యువత కన్నా చదువులేని వారే లాక్ డౌన్ పట్ల అవగాహనతో ఉన్నారని సర్వేలో తేలింది. సర్వే రిపోర్టును తెలంగాణ పోలీస్ అధికారిక ట్విట్టర్  ఖాతాలో షేర్ చేస్తూ..’మాకు అందిన సమాచారం ఆధారంగా, చేయబడ్డ చిన్న విశ్లేషణ., చిన్నబుచ్చుకోకుండా, పెద్దమనసు చేసుకుని, ఇంటి వద్దనే ఉండి, మీ బాధ్యత నిర్వర్తించండి.’ అని క్యాప్షన్ ఇచ్చారు.