వేలిముద్ర కాదు.. చేతి ముద్ర కూడా నేరస్థులను పట్టిస్తుంది - MicTv.in - Telugu News
mictv telugu

వేలిముద్ర కాదు.. చేతి ముద్ర కూడా నేరస్థులను పట్టిస్తుంది

November 4, 2019

ఏదైనా నేరం జరిగితే కేసును చేధించేందుకు పోలీసులు వేలి ముద్రల ఆధారంగా దర్యాప్తు చేస్తుంటారు. దీని ద్వారా నిందితులను గుర్తిస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో వేలిముద్రలు సరిగాలేకపోవడం వల్ల చాలా కేసులు మిస్టరీగానే ఉండిపోతున్నాయి. అసలైన నేరస్తులు ఎవరనేది నిర్ధారించడం సమస్యగా మారుతోంది. కానీ అటువంటి వాటికి చెక్ పెట్టేందుకు తెలంగాణ పోలీస్ యంత్రాంగం అత్యాధునిక టెక్నాలజీతో ముందుకు సాగుతోంది. నేరస్థులను గుర్తించేందుకు పాపిలాన్ అనే వ్యవస్థను ఉపయోగించుకుంటోంది.

Telangana Police.

పాపిలాన్ ద్వారా నేరం జరిగిన ప్రాంతంలో అరచేయి వరకు ఏ భాగంలో అయినా ఆనవాళ్లు దొరికితే దాని ఆధారంగా నేరస్థులను గుర్తించే వీలు ఉంటుంది. రష్యా నుంచి ఈ టెక్నాలజీని తీసుకున్నారు.  గత రెండేళ్లుగా దీని ద్వారా వందలాది కేసులలో నిందితులను కచ్చితంగా గుర్తించగలిగారు. కేవలం ఫింగర్ ప్రింట్‌పై మాత్రమే ఆధారపడకుండా అరచేతిలో ఏ భాగంలోని ఫ్రింట్ లభించినా కేసులను పూర్తి చేస్తున్నారు. లైవ్‌ స్కానర్‌ ద్వారా డిజిటల్‌ రూపంలో వేలిముద్రలను, అరచేతి ముద్రలను  సేకరించి పాపిలాన్ సాయంతో కేసులను ఛేదిస్తున్నారు. కాగా ఇప్పటి వరకు దీన్ని అమెరికాలోని ధర్యాప్తు సంస్థ ఎఫ్ఐబీ,ఇంటర్‌పోల్ లాంటి విభాగాలే దీన్ని వినియోగిస్తుండగా.. దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ పోలీసులు ఈ విధానాన్ని వాడుతున్నారు.