Telangana Poliset results released
mictv telugu

విద్యార్థుల్లారా..పాలిసెట్ రిజల్ట్స్ వచ్చేశాయి

July 13, 2022

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే నిర్వహించిన పాలిసెట్ ఫలితాలను అధికారులు కాసేపటిక్రితమే విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://polycetts.nic.in/ చెక్‌ చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ ఫలితాలను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ మిత్తల్ విడుదల చేశారు.

ఈ పాలిసెట్ పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా జూన్ 30న నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు 14,432 మంది విద్యార్ధినీ, విద్యార్ధులు హాజరయ్యారు. ఇక, ఈ పరీక్ష ద్వారా పాలిటెక్నిక్ డిప్లొమాతో పాటు వెటర్నిటీ, హార్టికల్చర్, అగ్రికల్చర్ సీట్లను భర్తీ చేస్తారు. ఫలితాలను ముందుగా అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి. తర్వాత అటెన్షన్ టు క్యాండిడేట్‌లో ‘డౌన్‌లోడ్ పాలిసెట్ 2022 రిజల్ట్స్’పై క్లిక్ చేయాలి. వెంటనే క్యాండిడేట్ లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ అభ్యర్ధి రోల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ నొక్కితే, ఫలితాలు స్క్రీన్ మీద కనపడతాయి.