Telangana: Postpone SSC Preliminary Exam: Candidates
mictv telugu

తెలంగాణ: ఎస్సై ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేయండి: అభ్యర్థులు

July 15, 2022

తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 7వ తేదీన జరిగే ఎస్సై ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేయాలని కొంతమంది అభ్యర్థులు పోలీసు నియామక మండలి అధికారులను సంప్రదించారు. అదే రోజున ఇంకో మూడు పరీక్షలు ఉన్నాయని, ఉన్నతాధికారులకు స్పందించి అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఎస్సై పరీక్షను వాయిదా వేయాలని కోరారు.

దేశవ్యాప్తంగా ఆగస్టు 1 నుంచి యూపీఎస్సీ అసిస్టెంట్ కమాండెంట్, ఐబీపీఎస్, ఆర్‌ఆర్‌బీ, ఆఫీస్ అసిస్టెంట్ పరీక్షలు జరగనున్నాయని యూపీఎస్సీ అధికారులు తాజాగా ఓ క్యాలండర్‌ను ప్రకటించారు. ప్రకటించిన క్యాలెండర్‌లో.. ఆగస్టులో జరగనున్న పరీక్షల తేదీలను వెల్లడించారు. దాంతో తెలంగాణ రాష్ట్రం నుంచి యూపీఎస్సీ, ఐబీపీఎస్, ఆర్‌ఆర్‌బీ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్న వందల మంది అభ్యర్థులు ఆందోళనకు గురై, ఎస్సై పరీక్షను వాయిదా వేయాలని అధికారులను వేడుకుంటున్నారు.

“యూపీఎస్సీ అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల నోటిఫికేషన్ రెండేళ్లకోసారి వస్తుంది. రెండు పరీక్షలకు హాజరయ్యేవారు. 20 వేల మంది వరకు ఉన్నారు. ఎస్పై రాతపరీక్షను వాయిదా వేయాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశాం. అయినా, వారి నుంచి ఏలాంటి స్పందన రాలేదు ” అని అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు.

మరోపక్క తెలంగాణలో జరగబోయే ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షలకు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేసినట్లు ఇదివరకే తెలిపారు. ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు కొన్ని నెలలుగా రాత్రిపగలు కష్టపడి చదువుతున్నారు. ఇటువంటి సమయంలో యూపీఎస్సీ తాజాగా ప్రకటించిన పరీక్షల క్యాలెండర్ విడుదల అవ్వడంతో అభ్యర్థులు అయోమాయంలో పడ్డారు. మరి ఈ విషయంపై రాష్ట్ర ఉన్నతాధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.