'సర్కారి వారి పాట'ను పెంచిన తెలంగాణ - MicTv.in - Telugu News
mictv telugu

‘సర్కారి వారి పాట’ను పెంచిన తెలంగాణ

May 9, 2022

‘సర్కారి వారి పాట’ చిత్ర బృందానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మహేష్ బాబు హీరోగా, కీర్తీ సురేష్ హీరోయిన్‌గా పరశురామ్ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ వ్యాప్తంగా టికెట్ల ధరలను పెంచుకునేందుకు సోమవారం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరలపై రూ.50 పెంచుకునేందుకు అనుమతిచ్చింది. దీంతో ఎయిర్ కండిషన్డ్, ఎయిర్ కూల్డ్ థియేటర్లలో టికెట్ ధరపై రూ.30 అదనంగా పెరగనుంది. తెలంగాణ వ్యాప్తంగా చిత్రాన్ని అదనపు ప్రదర్శనలు కూడా ప్రదర్శించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మరోపక్క ఏపీ ప్రభుత్వం సైతం ‘సర్కారు వారి పాట’ చిత్రానికి టికెట్ల ధరలు పెంచుకునేందుకు ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు తెలంగాణలో కూడా టికెట్ల విషయంలో అనుమతులు లభించడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమా మే 12న ఏ విధంగా ప్రేక్షకులను అలరిస్తుందోనని పలువురు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.