నగారా మోగింది.. డిసెంబర్ 7 తెలంగాణ ఎన్నికలు - MicTv.in - Telugu News
mictv telugu

నగారా మోగింది.. డిసెంబర్ 7 తెలంగాణ ఎన్నికలు

October 6, 2018

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. నాలుగు రాష్ట్రాలతోపాటు తెలంగాణకు కూడా ఎన్నికల షెడ్యూలు ఈ రోజు ప్రకటించారు. సీఈసీ ఓపీ రావత్ ఈ వివరాలను విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.

ttt

డిసెంబర్ 7న తెలంగాణలో ఒకే దశలో పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 11న కౌంటింగ్ జరిపి ఫలితాలు వెల్లడిస్తారు. రాజస్థాన్ ఎన్నికలు కూడా డిసెంబర్ 7నే జరిపి, 11న కౌంటింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 12న నోటిఫికేషన్ వస్తుంది. తెలంగాణ, రాజస్థాన్‌లలో 12 నుంచి 19 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 20న నామినేషన్లను పరిశీలిస్తారు. ఉపసంహర గడువు 22. ఛత్తీస్‌గఢ్ ఎన్నికలు రెండు దశల్లో నవంబర్ 12న, 20న జరుగుతాయి. మిజోరం, మధ్యప్రదేశ్‌లలో ఒకే విడతన నవంబర్ 28న జరుగుతాయి. తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను 11న ప్రకటిస్తారు.

కాగా, షెడ్యూలు ప్రకటనకు ముందు సీఈసీ తెలంగాణ ఎన్నికల జాబితా గురించి వివరణ ఇచ్చారు. ‘తెలంగాణలో ఓటర్ల జాబితాను ఈ నెల 8 నాటికి ప్రచురించాల్సి ఉంది. దీనికి మేం ఇంకా సమయం తీసుకుంటాం. జాబితాను హైకోర్టుకు చూపించాల్సి ఉంది. ఈ ప్రక్రియ అంతా ముగిసిన తర్వాత ఈ నెల 12న గాని, ఆ తర్వాత గాని కొత్త ఓటర్ల జాబితాను ప్రకటిస్తాం..ఈ ప్రక్రియకు ఎన్నికల షెడ్యూలు ప్రకటనకు సంబంధం లేదు ’ అని ఆయన తెలిపారు.తెలంగాణలో ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయంటూ కాంగ్రెస్ నేతలు కోర్టకెక్కడం తెలిసిందే. దీనిపై వివరణ ఇవ్వాలని కోర్టు ఈసీని ఆదేశించి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

5 States Press Note 06102018_PDF

తెలంగాణ షెడ్యూలు ఇలా.. మొత్తం 119 స్థానాలకు ఒకే విడత 
 ఎన్నికల నోటిఫికేషన్‌: నవంబర్‌ 12 
నామినేషన్లకు సమర్పణకు తుది గడువు: నవంబర్‌ 19 
నామినేషన్ల పరిశీలన నవంబర్‌ 20
 నామినేషన్ల ఉపసంహరణ గడువు: నవంబర్‌ 22 
 పోలింగ్‌ తేదీ డిసెంబర్‌ 7 
 ఓట్ల లెక్కింపు డిసెంబర్‌ 11