తెలంగాణలో మరో భారీ కంపెనీ పెట్టుబడులు పెట్టబోతోంది. బెంగళూరుకు చెందిన పారిశ్రామిక సంస్థ రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్‌కు అనుబంధమైన ఎలెస్ట్ కంపెనీ దేశంలోనే అతిపెద్దదైన అమొలెడ్ డిస్ప్లే ఫ్యాబ్ తయారీ పరిశ్రమను దుండిగల్ పారిశ్రామిక పార్కులో నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఫార్చూన్-500 కంపెనీల్లో ఒకటైన.. ఎలెస్ట్గా పిలిచే ఈ కంపెనీ, రాష్ట్రంలో 24వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. స్మార్ట్ టీవీలు, మొబైల్ ఫోన్లలో వినియోగించే అత్యాధునిక డిస్ప్లేలను ఎలెస్ట్ కంపెనీ తయారు చేయనుంది. డిస్ప్లే ఫ్యాబ్రికేషన్ తయారీలో ఇండియాలోనే అతిపెద్ద యూనిట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది.
ఇందుకు సంబంధించి మంత్రి కేటీఆర్ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో ఆదివారం బెంగళూరులోని రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ కేంద్ర కార్యాలయంలో అవగాహన ఒప్పందం కుదిరింది. ఆ సంస్థ చైర్మన్ రాజేశ్ మెహతా, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్లు దీనిపై సంతకాలు చేశారు. ఎంవోయూ తర్వాత మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ చరిత్రలో హిస్టారిక్ డే అంటూ ప్రస్తావించారు. రాష్ట్రానికి, దేశానికి గర్వకారణమని తెలిపారు. డిస్ప్లే సెక్టార్లో ఇండియాలోనే ఇది ఫస్ట్ యూనిట్‌గా తెలిపారు. ఇప్పటివరకు జపాన్, కొరియా, తైవాన్ దేశాలకు మాత్రమే సాధ్యమైన అమోల్డ్ డిస్ప్లే తయారీ, ఇకపై భారత్‌లో… తెలంగాణ వేదికగా జరగబోతోందన్నారు. ఈ పరిశ్రమ రాకతో టీవీలు, ట్యాబ్స్, స్మార్ట్ ఫోన్లకు అవసరమైన ఎకో సిస్టమ్ తెలంగాణలో తయారవుతుందని కేటీఆర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో తాము ఏర్పాటు చేయబోతున్న డిస్ప్లే ఫ్యాబ్ వలన ప్రపంచంలోనే అత్యుత్తమ గ్లోబల్ టాలెంట్‌ను ఆకర్షించేందుకు అవకాశం ఉంటుందని, అత్యాధునిక సాంకేతికత ఆధారంగా పనిచేసే ఈ ప్లాంట్‌లో 3000 మంది సైంటిస్టులు, ఇతర అత్యాధునిక టెక్నాలజీ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని ఈ అవగాహన ఒప్పంద కార్యక్రమం సందర్భంగా మాట్లాడిన రాజేష్ ఎక్స్పోర్ట్ చైర్మన్ రాజేష్ మెహతా అన్నారు.
Historic day for Telangana😊
Rajesh Exports (Elest), a Fortune-500 company, to setup India's first Display FAB to manufacture the most advanced AMOLED displays, with an investment of ₹24,000 Cr, making it one of the largest investments in high-tech manufacturing sector in India pic.twitter.com/ygb9wK50j4
— KTR (@KTRTRS) June 12, 2022