టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పెద్ద మనసుతో ఓ పేదింటి యువతి పెళ్లి బాజా మోగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దనపల్లి గ్రామానికి చెందిన ఓ యువతి పెళ్లికి ఆయన రూ.50వేల ఆర్థిక సహాయాన్ని అందించారు.మౌనిక అనే యువతి చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయింది. దాంతో అప్పటి నుంచి ఆమె ఆమె నానమ్మ దగ్గర పెరిగింది. ఈ నెల 7వ తేదీని మౌనిక పెళ్లికి ముహూర్తం కుదిరింది. ఇటీవల సిరిసిల్లకు వెళ్లిన కేటీఆర్‌ను కలిసి పెళ్లి పత్రిక అందించింది. ఈ సందర్భంగా తన కటుంబ పరిస్థితులను చెప్పింది. ఆమె దయనీయ పరిస్థితులను చూసి చలించిపోయిన టీఆర్ఎస్ నేత.. వెంటనే ఆమెకు రూ.50వేల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే కేటీఆర్ మౌనిక పెళ్లికి వెళ్లి డబ్బు అందించాలని పార్టీ నేతలకు సూచించారు. దీంతో నిన్న జరిగిన పెళ్లికి వెళ్లి, పందిట్లో రూ.50వేలు అందజేశారు.