వెయ్యికి అటుఇటు.. తెలంగాణలో నేడు 945 కరోనా కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

వెయ్యికి అటుఇటు.. తెలంగాణలో నేడు 945 కరోనా కేసులు

June 30, 2020

945 Positive.

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు గత కొన్ని రోజులుగా వెయ్యికి అటుఇటుగానే నమోదవుతున్నాయి. నేడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 945 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. నమోదైన ఈ కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే 869 కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లాలవారిగా తీసుకుంటే.. రంగారెడ్డి 29, సంగారెడ్డి 21, మేడ్చల్ 13, నిర్మల్ 4, కరీంనగర్ 2, మహబూబ్ నగర్ 2, సిద్దిపేట్ 1, సూర్యాపేట్ 1, ఖమ్మం 1, వికారాబాద్ 1, నిజామాబాద్ 1గా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 16,339కి పెరిగింది. ఈరోజు కరోనా చికిత్స పొందుతూ ఏడుగురు మృతిచెందగా.. ఇప్పటివరకు నమోదైన మరణాల సంఖ్య 260కి పెరిగింది.

నేడు ఎక్కవ సంఖ్యలో 1,712 మంది డిశ్చార్జ్ అవగా.. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 7,214కు పెరిగింది. ప్రస్తుతం 8,785 మంది కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, కరోనా వైరస్‌ ప్రజలకే కాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా సోకుతోంది. దీంతో వారు యశోద వంటి కార్పోరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో అనేక విమర్శలు వినబడుతున్నాయి. ‘మీకైతే కార్పోరేట్ ఆసుపత్రులు.. మాకైతే ఆ గాంధీ ఆసుపత్రా?’ అనే ప్రశ్నలు వినబడుతున్నాయి. దీనిమీద వైద్య ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ స్పష్టత ఇచ్చారు. వారివారి ఫ్యామిలీ డాక్టర్ల వద్ద వారు వైద్యం చేయించుకుంటున్నారని అన్నారు.