కరోనా దడ.. తెలంగాణలో 300 దాటిన మరణాలు  - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా దడ.. తెలంగాణలో 300 దాటిన మరణాలు 

July 6, 2020

తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో రెచ్చిపోతోంది. రెండు వేలకు చేరువలో నమోదై దడ పుట్టిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో కేసులు ఎక్కువగా నమోదవడంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా నేడు తెలంగాణలో 1,831 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే 1,419 కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లాల వారిగా తీసుకుంటే రంగారెడ్డిలో 160, మేడ్చల్‌లో 117, ఖమ్మం 21, మెదక్ 20, మంచిర్యాల 20, మహబూబ్ నగర్ 9, నల్గొండ 9, వరంగల్ అర్బన్ 9, పెద్దపల్లి 9, నిజామాబాద్ 9, వికారాబాద్ 7, సూర్యాపేట్ 6, కరీంనగర్ 5, జగిత్యాల 4, సంగారెడ్డి 3, గద్వాల్ 1, నారాయణ పేట్ 1, యాదాద్రి 1, మహబూబాబాద్ 1గా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 25,733కు పెరిగింది. ఇవాళ ఒక్కరోజే రికార్డు స్థాయిలో 11 మంది మృతిచెందగా.. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మృతుల సంఖ్య 306కు పెరిగింది. కరోనా చికిత్స పొందుతూ కోలుకుని నేడు 2,078 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 14,781కి చేరింది. కాగా, ప్రస్తుతం 10,646 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.