Telangana: Release of PhD notification in OU
mictv telugu

తెలంగాణ: ఓయూలో పీహెచ్డీ నోటిఫికేషన్ విడుదల

August 2, 2022

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఉన్న ప్రముఖ విశ్వవిద్యాలయం ఓయూ ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా పీహెచ్డీ చేయాలని నోటిఫికేషన్ కోసం కొన్ని నెలలుగా, వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న విద్యార్థినీ, విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని అధికారులు తెలిపారు. సోమవారం సాయంత్రం పీహెచ్డీ నోటిఫికేషన్‌ను విడుదల చేసి, పూర్తి వివరాలను వెల్లడించారు.

” ఈ పీహెచ్డీ ప్రవేశాలను రెండు క్యాటగిరీలలో నిర్వహిస్తాం. క్యాటగిరీ 1 కింద ఆయా సబ్జెక్ట్‌ల్లో జేఆర్ఎఫ్ లేదా ఏదైనా నేషనల్ ఫెలోషిప్ అర్హత సాధించిన విద్యార్థులు ఈ నెల 6 లోపు సంబంధిత డీన్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. క్యాటగిరీ 2 కింద ప్రవేశాలకు సంబంధించి..ముందుగా పీహెచ్డీ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తాం. ఫలితాలు వెలువడిన అనంతరం ఇంటర్వ్యూను నిర్వహించి సీట్లను భర్తీ చేస్తాం. కావున క్యాటగిరీ 2 అభ్యర్థులు 18 నుంచి వచ్చే నెల 17 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలకు www.osmania.ac.in, www.ouadmissions.com సంప్రదించండి” అని డైరెక్టర్ ప్రొఫెసర్ ఐ పాండురంగారెడ్డి అన్నారు.