తెలంగాణ ఆర్టీసీ మరో నిర్ణయం.. షార్ట్ ఫిలిం ఎంట్రీలకు దరఖాస్తులు - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ ఆర్టీసీ మరో నిర్ణయం.. షార్ట్ ఫిలిం ఎంట్రీలకు దరఖాస్తులు

April 16, 2022

trs

తెలంగాణ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. షార్ట్ ఫిలింలు తీసే వారికి శుభవార్త చెప్పింది. తెలంగాణ ఆర్టీసీ చేస్తున్న సేవలను తమ షార్ట్ ఫిలిం ద్వారా ప్రజలకు సులువుగా అవగాహన కల్పించాలనే ఆసక్తి ఉన్నవారి కోసం షార్ట్ ఫిలిం కాంటెస్ట్‌ను నిర్వహిస్తున్నామని, అందుకు సంబంధించి దరఖాస్తులను కూడా ఆహ్వానిస్తున్నామని ఆర్టీసీ తెలిపింది. సురక్షితమైన ఆర్టీసీ ప్రయాణం, లీటర్ పెట్రోల్ ధర కన్నా తక్కువగా రూ.100కే రోజంతా హైదరాబాద్ సిటీ బస్సుల్లో ప్రయాణం, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు బుక్ చేసుకుంటే, ఇంటికే ఆర్టీసీ బస్, కార్గో సేవలు, గరుడ, రాజధాని బస్సుల్లో సౌకర్యాలు, తదితర అంశాలపై ప్రజలను ఆకట్టుకునే విధంగా రెండు నిమిషాల నిడివితో కూడిన షార్ట్ ఫిలింలను తీసి తమకు పంపించాలని తెలిపింది.

చెప్పినా అంశాలను దృష్టియందు ఉంచుకొని, వీడియోలను పంపిస్తే ఆర్టీసీ మీకు ఆకర్షణీయమైన బహుమతులను అందజేస్తుందని పేర్కొంది. మొదటి బహుమతి రూ.10 వేలు, రెండో బహుమతి రూ. 5వేలు, మూడో బహుమతి రూ.2500 అందిస్తామని తెలిపింది. అయితే, ఆర్టీసీ షార్ట్ ఫిలిం కాంటెస్ట్‌లో పాల్గొనాలనుకునేవారు మీ పూర్తి వివరాలను ఈ నెల (ఏప్రిల్) 21 లోగా [email protected] పంపించాలని సూచించింది.