భూపాలపల్లిలో బస్సు బోల్తా.. గుట్కా డ్రైవర్ నిర్వాకం.. - MicTv.in - Telugu News
mictv telugu

భూపాలపల్లిలో బస్సు బోల్తా.. గుట్కా డ్రైవర్ నిర్వాకం..

May 15, 2019

భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలో ఈ రోజు ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఏకంగా మూడు పల్టీలు కొట్టి బోల్తాపడింది. 60 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న ఈ బస్సులో ప్రమాదం కారణంగా 35 మంది గాయపడ్డారు. పెద్దపల్లి జిల్లా మంథని నుంచి వస్తున్న బస్సు పీవీనగర్ వద్ద సోమన్ పల్లి వంతెన సమీపంలో అదుపు తప్పి పల్టీలు కొట్టింది.

Telangana rtc Bus flips in bhupalapalli  while going to Godavarikhani passengers blames gutka driver people injured.

క్షతగాత్రుల్లో కొందరికి తీవ్ర గాయాలు కావడంతో మహదేవ్‌పూర్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు మండిపడుతున్నారు. అతడు గుట్కా వేసుకుంటూ నడిపి, అదుపు స్టీరింగ్ వదిలేయడంతో బస్సులు బోల్తా కొట్టిందని అంటున్నారు. ప్రమాదం తర్వాత డ్రైవర్ పరారయ్యాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.