తెలంగాణ ఆర్టీసీ బస్సు బోల్తా.. ఇద్దరి మృతి - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ ఆర్టీసీ బస్సు బోల్తా.. ఇద్దరి మృతి

April 16, 2019

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) బస్సు ఒకటి ప్రమాదానికి గురైంది. ఏపీలోని కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు వద్ద మంగళవారం టీఎస్ఆర్టీసీ బస్సు.. అదుపుతప్పి బోల్తాపడింది. డ్రైవర్, కండక్టర్ చనిపోగా, 9 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Telangana RTC bus flips on highway in Andhra Pradesh krishana district driver and conductor killed 9 passengers injured.

బస్సు తెల్లవారుజామున ఒంగోలు నుంచి నిర్మల్‌కు వెళ్తుండగా తోటచర్ల వద్ద జాతీయ రహదారిపై అదుపు తప్పింది. క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడకు తీసుకెళ్లారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. అతడు నిద్రమత్తులో తరచూ సడన్ బ్రేకులు వేస్తూ నడిపాడని, బస్సు మూడు పల్టీలు కొట్టి, పొలాల్లోకి వెళ్లిందని అంటున్నారు.