తాత్కాలిక ఎఫెక్ట్.. బార్‌లో దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు - MicTv.in - Telugu News
mictv telugu

తాత్కాలిక ఎఫెక్ట్.. బార్‌లో దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

October 29, 2019

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 25వ రోజుకి చేరింది. సమ్మె కారణంగా తాత్కాలిక డ్రైవర్లు బస్సులు నడుపుతున్నారు. తాత్కాలిక డ్రైవర్ల పుణ్యమా అని ప్రయాణికులు ఆర్టీసీ బస్సు ఎక్కాలంటేనే భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది. నైపుణ్యంలేని డ్రైవర్ల కారణంగా ప్రతిరోజూ ఏదో చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కొన్నిచోట్ల ప్రమాదాలు జరిగి బస్సులు డ్యామేజ్ అవుతున్నాయి. మరికొన్ని చోట్ల ఏకంగా ప్రాణాలు కూడా పోతున్నాయి. ఇప్పటికే పలు ప్రమాదాలు నమోదయ్యాయి. తాజాగా ఖమ్మం జిల్లా బోనకల్ క్రాస్ రోడ్డులో ఆర్టీసీ బస్సు ఓ బార్‌లోకి దూసుకెళ్ళింది. 

Telangana rtc bus.

దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు స్వల్ప గాయాలయ్యాయి. బస్సు కూడా కొంతమేర డ్యామేజ్ అయింది. ఇక సమ్మె విషయానికి వస్తే అటు ప్రభుత్వం, ఇటు కార్మికులు సమ్మెపై వెనక్కి తగ్గడం లేదు. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ కార్మికుల సమ్మె వ్యవహారం హైకోర్టులో ఉంది. కార్మికులతో సమ్మె విరమింపజేసే అధికారం కోర్టుకు లేదని హైకోర్టు వెల్లడిచింది. అలాగే బుధవారం ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన బహిరంగ సభకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.