త్వరలో రోడ్డెక్కనున్న తెలంగాణ ఆర్టీసీ బస్సు! - MicTv.in - Telugu News
mictv telugu

త్వరలో రోడ్డెక్కనున్న తెలంగాణ ఆర్టీసీ బస్సు!

May 11, 2020

Telangana rtc busses may restart from may 15

లాక్ డౌన్ కారణంగా తెలంగాణలో ఆర్టీసీ బస్సులు గత 50 రోజులుగా డిపోలకే పరిమితమయ్యాయి. దాంతో ఆర్టీసీ సంస్థ పెద్ద ఎత్తున ఆర్థిక నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా గ్రీన్‌జోన్లలో ప్రజారవాణాకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెల్సిందే. దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడా గ్రీన్ జోన్లలో బస్సులు నడుపాలని యోచిస్తున్నట్లు సమాచారం.

ఈ మేరకు ఈరోజు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సమీక్ష సమావేశం నిర్వహించారు. డిపో మేనేజర్ల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. బస్సుల్లో ఎంత మంది ప్రయాణించాలి? చార్జీలు ఎలా ఉండాలి? అనే విషయాలపై సమీక్షిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల అమలుకు సిద్ధంగా ఉండాలని డిపో మేనేజర్లకు సూచించారు. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

సీఎం కేసీఆర్‌ అనుమతి ఇవ్వగానే బస్సులు నడిపేలా సిద్ధం చేస్తున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో భౌతిక దూరం పాటించాల్సి ఉన్నందున బస్సులో 20 మందికి మించి ప్రయాణించకుండా చర్యలు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. అలాగే, అన్ని బస్టాండ్‌లలో శానిటైజర్లు కూడా అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ఈ నెల 15 నుంచి ప్రజారవాణాకు ప్రభుత్వం అనుమతిస్తుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.