తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యం.. సంపూర్ణేష్‌బాబు కారుకి ప్రమాదం - MicTv.in - Telugu News
mictv telugu

తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యం.. సంపూర్ణేష్‌బాబు కారుకి ప్రమాదం

November 27, 2019

నిన్న హైదరాబాద్‌లో తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ ఉద్యోగిని బలైన విషయం మరువకముందే ఈరోజు మరో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సినీ నటుడు సంపూర్ణేష్ బాబుకి త్రుటిలో ప్రమాదం తప్పింది.

actor sampoornesh babu.

ఈరోజు ఉదయం సిద్దిపేటలోని కొత్త బస్టాండ్ దగ్గర సంపూర్ణేష్ బాబు కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదం సమయంలో కారులో ఆయన కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. ఈ ఘటనలో సంపూర్ణేష్‌తో పాటు ఆయన భార్య, కూతురుకి స్వల్ప గాయాలయ్యాయి.