తెలంగాణ ఆర్టీసీ కొన్నాళ్లుగా ప్రయాణికులకు రాయితీలు, విద్యార్థులకు ఉచిత ప్రయాణాలు వంటి ఆకర్షణీయ చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. పెంచిన చార్జీల భారాన్ని మరపించేందుకు ఇలాంటి ‘రిలీఫ్’ అందిస్తోందనే విమర్శలూ ఉన్నాయి.
ఈ విషయం పక్కనబెడితే టీఎస్ఆర్టీసీ మంచినీళ్లు బాటిళ్ల ఉత్పత్తిని ప్రారంభిస్తోంది. ఆర్టీసీ నీళ్ల సీసాలు ఏ రూపంలో ఉండాలి, వాటికి ఏ పేరు పెడితే బావుంటుందని మల్లగుల్లాలు పడుతోంది. పేరు, డిజైన్‌ను ప్రజలే నిర్ణయిస్తే బావుంటుందని ఆఫర్ ప్రకటించింది.
లీటరు, 500 ఎంఎల్ బాటిళ్లకు మంచి డిజైన్, మంచి పేరు సూచించిన వారికి రివార్డులు ఉంటాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విటర్లో తెలిపారు. పేరు, డిజైన్ వివరాలను ఆర్టీసీ వాట్సాప్ నంబర్ 94409-70000 పంపాలని కోరారు.
#TSRTCompetition https://t.co/NE5h8WwvYy
— TSRTC (@TSRTCHQ) May 28, 2022