కేసీఆర్‌కు మీరైనా చెప్పండి..చినజీయర్‌తో కార్మికులు - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్‌కు మీరైనా చెప్పండి..చినజీయర్‌తో కార్మికులు

October 30, 2019

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 26వ రోజుకి చేరింది. సమ్మె నేపథ్యంలో ఈరోజు సరూర్ నగర్‌లో ఆర్టీసీ కార్మికులు బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె వ్యవహారంపై హైకోర్టులో రేపు విచారణ జరుగనుంది. ఈ క్రమంలో కొందరు ఆర్టీసీ ఉద్యోగులు శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామిని కలిశారు. ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో ప్రభుత్వానికి కనువిప్పు కలగజేయాలంటూ వేడుకున్నారు. సీఎం కేసీఆర్‌.. చినజీయర్ స్వామిజీల మధ్య సత్సంబంధాలు ఉన్న సంగతి తెలిసందే. ఇటీవల స్వామిజీ పుట్టినరోజు వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు.

ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు బుధవారం ముచింతల్‌లో ఉన్న ఆశ్రమంలో స్వామీజీని కలిసి వినతిపత్రాన్ని అందించారు. అలాగే కేసీఆర్‌కు సమ్మె గురించి, ఆర్టీసీ కార్మికుల కష్టాల గురించి వివరించాల్సిందిగా కోరారని తెలుస్తోంది. గత 26 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నుంచి తగిన స్పందన కరవైందని కార్మిక నేతలు స్వామిజీ వద్ద మొర పెట్టుకున్నారు. సమ్మె కారణంగా ఇటు ప్రయాణికులకు ఇబ్బందులు, కార్మికులకు కష్టాలు కొనసాగుతున్నాయి అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించనిపక్షంలో మరింత గడ్డు పరిస్థితులేర్పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు.