అన్ని డిపోల్లో కేసీఆర్‌కు పాలాభిషేకాలు - MicTv.in - Telugu News
mictv telugu

అన్ని డిపోల్లో కేసీఆర్‌కు పాలాభిషేకాలు

November 29, 2019

ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరడానికి అవకాశమిచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ ప్రకటనపై ఆర్టీసీ కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం పలు డిపోల్లో కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు. 

Telangana police

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ముషీరాబాద్-2 డిపోలో ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అలాగే తెలంగాణలోనిపలు డిపోల్లో కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. కేసీఆర్ జిందాబాద్‌ అంటూ కార్మికులు నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్షలకు తగ్గట్లు పనిచేసి ఆర్టీసీని మళ్ళీ లాభాల్లోకి తెస్తామన్నారు. కిలోమీటర్‌కు రూ.20 పైసల చొప్పున చార్జీలు పెంచేందుకు అవకాశం ఇస్తూ కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయానికి కార్మికులు ధన్యవాదాలు తెలిపారు.

డ్యూటీలో చేరేందుకు క్యూ కట్టిన కార్మికులు

ముషీరాబాద్ 1 డిపో ముందు కార్మికుల సందడి